ఒంగోలుకు ఈనెల 30వ తేదీన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి రానున్నట్లు కమిషన్ కార్యదర్శి పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలలలో డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు జిల్లా స్థాయిలో జాయింట్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కమిషన్ సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కమిషన్ సభ్యులు పద్మావతి రానున్నట్లు తెలిపారు.