ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆదివారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక భవనంలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ పాలకమండలి సమావేశంలో ముఖ్యమంత్రి తో పాటు, ఎంపీ మాగుంట సైతం పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రపంచ స్థాయి ఉత్పత్తుల తయారీపై ప్రసంగించిన ఎంపీ మా గుంటను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.