ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హౌసింగ్ శాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 29, 2024, 09:46 PM

గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ రివ్యూలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం నాడు హౌసింగ్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులకు సీఎం సూచనలు, సలహాలు చేశారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం మంత్రి పార్ధసారధి మీడియాకు పలు కీలక విషయాలు వెల్లడించారు. గ్రామాల పరిధిలో పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పట్టణాల్లో పేదలకు 2 సెంట్ల స్థలాన్ని ఇస్తామని అన్నారు. కొత్త లబ్ధిదారులకు ఈ విధానం అమలు చేయనున్నామని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com