విజయనగరం జిల్లాలోని పోలీసు స్టేషన్‌లకు వచ్చే బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి 35 ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి.. ఫిర్యాదీకి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ కలహాలకు సంబఽంధించి నాలుగు ఫిర్యాదులు, భూ తగాదాలకు 13, మోసాలకు పాల్పడినట్టు 8 ఫిర్యాదులు, ఇతర విషయాలకు సంబంధించినవి 9 ఫిర్యాదులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌పీ ఆష్మాపరహీన్, డీఎస్పీ వీరకుమార్, సీఐలు నర్సింహమూర్తి, ఎస్‌ఐ మురళి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.