పాలిచ్చే తల్లులకు ప్రత్యేక గది అవసరమని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్దినకర్ పుండ్క ర్ తెలిపారు. సోమవారం మీకోసం కార్యక్రమానికి వచ్చే పాలిచ్చే తల్లులు, జడ్పీలో పని చేసే ఉద్యోగినులకు ఉపయోగ పడేలా జడ్పీ సమావేశ మం దిరంలో ప్రత్యేకంగా ఓ గదిని కలెక్టర్ప్రారంభించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బేటీ బచావో-బేటీపడావో పథకం కింద ఈగదులు తెరిచినట్లు తెలిపారు. శ్రీకా కుళం,టెక్కలి, పలాస,నరసన్నపేట ఆర్టీసీబస్టాండుల్లో గదులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్అహ్మద్ఖాన్ పాల్గొన్నారు.