ఇకనుంచి సబ్ డివిజన్ల వారీగా నాకాబంది కార్డెన్ సెర్చ్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రానున్న రోజుల్లో సబ్ డివిజన్ల వారీగా ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టునున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా తొలి విడత వెస్ట్ సబ్ డివిజన్లోని పట్టాభిపురం, నగరంపాలెం, అరండల్‌పేట ేస్టషన్‌లు, అలాగే సౌత్ పరిధిలోని నల్లపాడు పోలీస్ ేస్టషన్ పరిధిలో ఆదివారం ఏకకాలంలో పది ప్రదేశాల్లో నాకాబంది నిర్వహించినట్లు తెలిపారు. అటు రవాణా శాఖ అధికారులను సమన్వయం చేసుకొని ఒక్కో బృందంలో అదనపు ఎస్పీస్థాయి అధికారితో మొత్తం 16 మంది సిబ్బంది ఉండేలాగా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ విధంగా పది చోట్ల 160 మందితో ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా త్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనాలు నడపడం, అదేవిధంగా ఎటువంటి పత్రాలు లేని వాహనాలను ఈతనిఖీల్లో గుర్తించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 286 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామన్నారు. అందులో 98 వాహనాల నుంచి రూ.5 లక్షల 26 వేల 900 అపరాధ రుసుముగా వసూలు చేశామన్నారు. ఈ విధంగా పోలీస్ అధికారులందరినీ ఒక సబ్ డివిజన్ పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతాలకు ముందుగా తరలించి ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు . రానున్న రోజుల్లో మిగిలిన సబ్ డివిజన్లలో ఇదే తరహాలో నాకాబందీ పేరుతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆయా సబ్ డివిజన్‌ల పరిధిలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తామన్నారు. ఇటువంటి తనిఖీల కారణంగా గంజాయి, మాదక ద్రవ్యాల వంటి అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు నేరస్తుల కలదికలను పసిగట్టే వీలుంటుందన్నారు.