అనంతపురం జిల్లా, విడపనకల్లు మండలంలోని గడేకల్లు గ్రామంలో మొహరం వేడుకలు ముగిసిపోయి 13 రోజులు అయింది. అయితే పూడ్చిన పీర్ల గుండం గుండం నుంచి మంటలు బయటకు వస్తున్నాయి. గడేకల్లులో తప్పడం స్వామి పీర్లుగుడిలో పెద్ద పీర్ల పండుగ సందర్భంగా అగ్ని గుండం వెలిగించి పీర్ల ప్రవేశం చేయించారు. పీర్ల జలధి సందర్భంగా అగ్ని గుండాన్ని ఈ నెల 15వతేదీన మట్టితో కప్పి పూడ్చి వేశారు. అగ్ని గుండం పూడ్చి సోమవారానికి 13 రోజలు అయింది. అయితే గుండలో నుంచి మంటలు వస్తుండటంతో.... ఇది స్వామి మహిమ అంటూ ఈ దృశ్యాన్ని తిలకించేందుకు తరలి వెళ్తున్నారు.