చంద్రబాబు సూపర్ - 6 హామీలు రాష్ట్రంలో ఇచ్చారు. అవి సారీ - 6గా మారకూడదని ఎంపీ మిథున్‌రెడ్డి విమర్శించారు. తన నియోజకవర్గంలోకి వెళ్తే తనను అడ్డుకుని దాడులకు పాల్పడ్డారని, వాహనాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇంతా చేసి తనపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు ఇలా ఉంటే, రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. మూలధన వ్యయం కోసం కేటాయించిన రూ. 11 లక్షల కోట్లను ఇతర అవసరాల కోసం ఖర్చు పెట్టవద్దని కోరారు. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోనే ఆర్థికవృద్ధి పెరుగుతుందని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.