ఇసుక రవాణా రేట్ల నిర్దారణ పై ట్రాక్టర్, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ లతో జాయింట్ కలెక్టర్ నిధి మీనా మంగళవారం కలెక్టరేట్ లో సమావేశాన్ని నిర్వహించారు. ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే ఉచిత ఇసుక విధానానికి తోడ్పాటునందిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు ప్రజలకు ఇసుకను రవాణా చేసేందుకు సహకరించాలని కోరారు