ఏపీలో పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రామలింగంపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పార్వతికి జేడీగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. టీచర్ల బదిలీల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ రామలింగంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.