ఫాస్టాగ్ సర్వీసులపై ఆగస్టు 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానున్నది. వాహనం కొనుగోలు చేసిన 90 రోజుల్లోగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఫాస్టాగ్ నంబర్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.ఫాస్టాగ్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు అన్ని షరతులు నెరవేర్చేందుకు ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు సమయం ఉంటుంది. నూతన ఫాస్టాగ్‌ని జారీ చేయడం, సెక్యూరిటీ డిపాజిట్, కనీస రీఛార్జ్‌ని కూడా ఎన్‌పీసీఐ నిర్ణయించింది.