ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు రాశి ఫలాలు

Astrology |  Suryaa Desk  | Published : Wed, Jul 31, 2024, 08:47 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)


 


అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతి సమస్యనూ, ప్రతి ఇబ్బందినీ ధైర్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగుతాయి. మధ్యలో నిలిచిపోయిన పనుల్ని నిదానంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. ఆదాయ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యానికి లోటులేదు.


 


 


వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)


 


కుటుంబ వ్యవహారాల్లో ఒకరిద్దరు బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్తలు అందే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల కొద్దిగా ఇబ్బంది పడ తారు.


 


మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)


 


చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తయి ఊరట లభిస్తుంది. నూతన ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. సమాజంలో ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన యోగానికి అవకాశం ఉంది. ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.


 


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)


 


జీతభత్యాల విషయంలో ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో కొన్ని ముఖ్యమైన సమస్యల్ని అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూలతలు పెరుగుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయ త్నంతో చేతికి అందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది.


 


సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)


 


కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు మధ్యలో నిలిచిపోయే అవకాశం ఉంది. ఏ పని తల పెట్టినా ఆటంకాలుంటాయి. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. బరువు బాధ్యతల వల్ల విశ్రాంతి లేని పరిస్థితి తలెత్తుతుంది. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల వల్ల చికాకులు ఎదురవుతాయి. వృత్తి జీవితంలో రాబడి సామాన్యంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది.


 


కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)


 


ఆదాయ ప్రయత్నాలు కొంత నిలకడగా సాగిపోతాయి. బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. కొందరు మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపార లావాదేవీలు, కార్యకలాపాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా గడిచిపో తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.


 


తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)


 


ఇష్టమైన బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాల్లో లాభాలు అందు కోవడం, శుభవార్తలు వినడం జరుగుతుంది. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగు తుంది. కుటుంబ పెద్దలు అవసరాల్లో ఆదుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనుకోకుండా ఉద్యోగ యోగం పడుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడు తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది.


 


వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)


 


దగ్గర బంధువులతో దీర్ఘకాలిక వివాదాలు తీరిపోయి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వృత్తి, వ్యాపారాలు సజా వుగా, సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులతో ఉన్న సమస్యలను లౌక్యంగా పరి ష్కరించుకుంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


 


ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)


 


ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. చదువుల విషయంలో పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబసమేతంగా దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా వృథా ఖర్చులు కూడా పెరుగుతాయి.


 


మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)


 


ప్రయాణాలు ఆర్థికంగా బాగా లాభిస్తాయి. మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి. బంధువుల నుంచి అందిన శుభవార్తలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవం తంగా పూర్తవుతాయి. రావలసిన సొమ్మును, బాకీలను పట్టుదలగా వసూలు చేసుకుంటారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపో తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.


 


కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)


 


ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మిత్రుల సహాయంతో కీలకమైన వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. సోదరులతో ఆస్తి ఒప్పందం కుదర్చుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక సమస్యల్ని చాలావరకు పరిష్కరించుకుంటారు. వస్త్రా భరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో కొన్ని చికాకులు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. అనుకోకుండా మొండి బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.


 


మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)


 


ఆదాయానికి లోటుండదు. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. చేపట్టిన ముఖ్యమైన పనుల్లో అవరోధాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను అందుకుం టారు. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa