ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధి హామీ కూలీలకు శుభవార్త తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు.గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా 6.50 కోట్ల పనిదినాలు కేటాయించింది.మంగళవారం దిల్లీలో నిర్వహించిన సమావేశంలో మరో 6.50 కోట్ల పనిదినాలకు ఆమోదం తెలిపినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.అదే విధంగా ఇప్పటి వరకు ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సి బకాయిలను సత్వరమే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు కేంద్ర ప్రభుత్వం సమ్మతించినట్లు పవన్ తెలిపారు. ఇందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు.