ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ప్రభుత్వం ఆర్డినెన్స్- రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఇలా
గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి రేపటితో ముగియనుండటంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
సుమారు రూ.1.30 లక్షల కోట్లతో 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ప్రభుత్వం ఆమోదం తీసుకుంది.
దీంతో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండుసార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టైంది.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆన్‌లైన్‌లో మంత్రుల నుంచి ఆమోదం తీసుకున్న ప్రభుత్వం, గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి బుధవారంతో ముగియనున్న దృష్ట్యా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్సును జారీ చేసింది. 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ప్రభుత్వం మంత్రుల నుంచి ఆమోదం తీసుకుంది. సుమారు లక్షా 30 వేల కోట్ల మేర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ఇచ్చింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం వచ్చేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు ఇచ్చింది.అన్నా క్యాంటీన్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు చేసింది. రోడ్ల మరమ్మతులకు 1100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్కు నిధులు కేటాయించినట్లు సమాచారం. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో 2 నెలలు సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది.
కాశముంది.