మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో కర్నూల్ రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్, అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యా సాగర్ ను మదనపల్లె జనసేన ఇంచార్జి, రాయలసీమ కో- కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి బుధవారం మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్ఛం అందజేశారు. మదనపల్లిలో 10సంవత్సరాలు వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీలే పాలన చేసి ప్రజలను దోచుకొని దాచుకున్నారని తెలిపారు. వైసీపీ నాయకులు ఎన్నో సమస్యల సృష్టించి ప్రజల భూములు లాక్కొన్నారని తెలిపారు.