ఏపీలోనే పెద్దదైన రంపచోడవరం నియోజకవర్గంలో ప్రజలను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా... ఆసుపత్రులలో మరణించిన వారిని ఇళ్లకు తీసుకువెళ్లాలన్నా సరైన సౌకర్యాలు లేవు. మూడు రోజుల క్రితం దారగూడెం గ్రామానికి చెందిన నెరం పద్మ అనే ఆశా కార్యకర్త అనారోగ్యంతో కాకినాడ జీజీహెచ్ లో మరణించారు. అయితే ఆమె భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేదు. విషయం తెలిసిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి సొంత ఖర్చు రూ. 5500 లతో అంబులెన్స్ ఏర్పాటు చేసారు. అంతేకాకుండా ఇకమీదట ఇలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక శాశ్వత అంబులెన్స్ ఏర్పాటు చేసారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9న దీన్ని అడవిబిడ్డలకు అంకితం చేయనున్నారు. అంగన్ వాడీ టీచర్ అయిన మిరియాల శిరీషాదేవికి చంద్రబాబుగారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె ప్రజాసేవను చూసి చంద్రబాబు గారి సెలక్షన్ గ్రేట్ అంటున్నారు ప్రజలు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ నేత అనంత బాబుకు టీడీపీ ఎమ్మెల్యే శిరీష గారికి తేడా గురించి ప్రజలు చెప్పుకుంటున్నారు.