నందిగాం మండల డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గురుకులంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా అధికారులు, గురుకులం జిల్లా కో ఆర్డినేటర్ లు త్వరితగితన పూర్తి నివేదిక అందించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యార్థిని మృతికి ఒత్తిడి వల్ల, లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయాన్న కోణంలో దర్యాప్తు చేపట్టాలన్నారు.