ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తాం!!!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 31, 2024, 06:09 PM

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు తో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014-19 వరకు చంద్రబాబు హయాంలో ఏపీలో పారిశ్రామిక విధానాన్ని కి ఆకర్షితులైన అనేక మంది పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చారని వివరించారు.గతంలో పెట్టుబడులకు పారిశ్రామకవేత్తలు భయపడే పరిస్థితి ఉండేదని ఆరోపించారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో పారిశ్రామకి క్లస్టర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని వెల్లడించారు.ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఇండస్ట్రీయల్‌ పాలసీ, ఎంఎస్‌ఎంఈ , క్లస్టర్‌ పాలసీని 45 రోజుల్లో తీసుకురానున్నామని తెలిపారు. ఏపీలో సహజ సిద్ధమైన వనరులున్నాయని, వాటిని వినియోగించుకుని ముందుకు వెళ్తామని వివరించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారని వెల్లడించారు. సుమారు 75 వేల కోట్ల రూపాయల వ్యయం కాగల బీపీసీఎల్‌ ఇండస్ట్రీ ఏపీకి రాబోతుందని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com