ఒంగోలు జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో వానజాడ లేకపోగా ఎండల తీవ్రత పెరిగింది. పలుచోట్ల 40డిగ్రీలకు చేరువలో ఎండలు కాస్తుండటంతోపాటు వడగాలులు కూడా వీస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్న సమయంలో సంతనూ తలపాడు, చీమకుర్తి, పొన్నలూరు మండలాల్లో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సగానికిపైగా మండలాల్లో 37డిగ్రీల కన్నా అధికంగా ఎండ కాచింది. ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఎండల తీవ్రత ఉంటోంది. ఎండలకు వేడిగాలులు, ఉక్కపోత తోడు కావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.