నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రంలో భూముల సమగ్ర రీసర్వేను, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీవ్రంగా తప్పు పట్టిన చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మాజీ మంత్రి రాంబాబు గుర్తు చేశారు. భూములు, గనులు, సహజ వనరుల దోపిడి జరిగిందంటూ, ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు.. రాష్ట్రంలో భూముల రీసర్వేను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. కొద్ది రోజుల్లోనే యూటర్న్ తీసుకున్నారని ఆయన ఆక్షేపించారు. స్వప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకోవడం చంద్రబాబు నైజం అని ఆయన అన్నారు.