శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి ఆడికృత్తిక ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీవళ్లీ దేవసేన సమేత కుమారస్వామిని అలంకార మండపంలో విశేషంగా అలకరించి మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య నారద పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు.తెప్పలపై అధిష్ఠింపజేసి పూజలు చేశారు. అనంతరం విద్యుత్ దీపకాంతుల మధ్య పుష్కరిణిలో తెప్పపై విహరించిన కుమారస్వామిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు.ఈవో ఎన్‌వీఎ్‌సఎన్ మూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.