ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం ధర్మాసనం తీర్పును స్వాగతిస్తున్నాం. 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ పై ముందడుగు వేసిన పార్టీ తెలుగుదేశం. అన్ని వర్గాలకు న్యాయం జరగాలి....సామాజిక న్యాయం గెలవాలి అనేదే తెలుగుదేశం సిద్ధాంతం. అత్యంత నిరుపేదలకు ఫలాలు అందించేందుకు వర్గీకరణ ఉపయోగపడుతుంది. దళితులు ఐక్యంగా ఉండి...అభివృద్ధి సాధించాలి. ఆర్థికంగా, సామాజికంగా వారి జీవితాల్లో వెలుగులు రావాలి.