తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కుమార్ యాదవ్ గురువారం పేర్కొన్నారు. ధర్మవరం సాయి నగర్ లోని ప్రభుత్వ యు పి హెచ్ సి లో నిర్వహించిన 'ప్రపంచ తల్లి పాలు'కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మాత్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ పాల్గొని ప్రపంచ తల్లి పాల వారోత్సవాల కరపత్రాలని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి పాలు అమృతంతో సమానమన్నారు.