ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పింఛన్ల పంపిణీ విజయవంతంగా సాగడం హర్షణీయం:ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 01, 2024, 05:19 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పింఛన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేశారు. 64 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు రూ.2737.4 కోట్ల మొత్తాన్ని ఈ రోజు ఉదయం నుంచీ ఇంటింటికీ వెళ్ళి పెన్షన్లు అందించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన కార్యక్రమం ప్రజలకు చేరువైంది. అందరూ హర్షించేలా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసినా సంక్షేమ పథకాల అమలుకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com