ఇవాళ శ్రీశైలం లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. 10.30 కి సున్నిపెంట హెలిప్యాడ్‌కు చంద్రబాబు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా వెళ్లి.. సాక్షి గణపతి, వీర భద్ర స్వామి, భ్రమ రాంబిక మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకోనున్నారు. శ్రీశైలం డ్యాం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి వాయనం సారె సమర్పించనున్నారు. ఏపీ జెన్ కో కుడి గట్టు జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించనున్నారు. సున్నిపెంట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రజా వేదికలో పాల్గొని స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను చంద్రబాబు తెలుసుకోనున్నారు. నేడు సీఎం చంద్రబాబు నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటకు వెళ్తారు. అక్కడ నుంచి వాహనంలో శ్రీశైలం చేరుకొని మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకోనున్నారు. అనంతరం శ్రీశైలం రిజర్వాయర్ వద్దకు చేరుకుని, కృష్ణా నదికి ఇచ్చే హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీశైలం డ్యామ్ వద్ద కృష్ణమ్మకు చీర, సారె సమర్పించి జలహారతి ఇవ్వనున్నారు. అక్కడే ఉన్న శ్రీశైలం పవర్ స్టేషన్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత సున్నిపెంటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమల గ్రామానికి వెళ్తారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేస్తారు. మధ్యాహ్నం 1.45 గంటలకు గుండుమలకు చేరుకుంటారు. గ్రామంలో పింఛన్ లబ్ధిదారులు ఓబులమ్మ, రామన్న ఇళ్ల వద్దకు వెళ్లి, వారికి పింఛన్లు అందజేస్తారు. అనంతరం గ్రామం నడిబొడ్డున ప్రజావేదికలో పట్టు రైతులు, గుండుమల ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతారు.