రాజమహేంద్రవరం జిల్లాలోని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)ల ఎన్నికకు ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం షెడ్యూల్ విడుదల చేస్తామని సర్వ శిక్ష అభియాన్ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్.సుభాషిని బుధవారం పేర్కొన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల ఎన్నికలకు గురువారం ఉదయం 10 గంటలకు షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. అదే రోజు మధ్యాహ్నం 2గంటలకు నోటీసు బోర్డుల్లో ఓటరు జాబితా ప్రదర్శిస్తారని చెప్పారు. 5న ఉదయం 9 గంటల నుంచి ఒంటిగంట వరకూ ఓటరు జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం ఉంటుందన్నారు. ఖరారు చేసిన ఓటరు జాబితాను మధ్యాహ్నం 3గంటల నుంచి 4గం టల వరకూ నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచుతారన్నారు. 8న ఉద యం 7 గంటల నుంచి ఒంటిగంట వరకూ ఎన్నికల పోలింగ్, 1.30గంటలకు ఎన్నికైన కమిటీ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారన్నారు. 2గంటలకు ప్రమాన స్వీకారం అనంతరం 3గంటలకు నూతనంగా ఎన్నికైన కమిటీచే పాఠశాల నిర్వహణ సమావేశం జరుగుతుందని ఆమె తెలిపారు.