సేంద్రీయ ప్రకృతి వ్యవసాయం వలన అధిక దిగుబడులు సాధించటంతో పాటు భూసారాన్ని పెంపొందించుకోవచ్చని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ.కరుణశ్రీ, డాక్టర్ ఎం.రాఘవేంద్రారెడ్డి అన్నారు. దేవరపల్లి మండలం దుద్దుకూరులో బుధవారం వైఎస్సార్ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం సేంద్రీయ ప్రకృతి వ్యవసాయ విస్తర్ణ పథకంలో భాగంగా దుద్దుకూ రులో రైతులకు 2రోజులపాటు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులకు సేంద్రీయ ఎరువుల వినియోగంపై అవగాహాన కల్పించా రు. వ్యవసాయ భూమిలో పచ్చిరొట్ట ఎరువులైన జనుము, పిల్లిపెసర, మొదలైన పంటలు పండించి దుక్కులో కలియదున్నాలని దీని వలన భూసారం పెంపొందుతు ందన్నారు. ప్రకృతి వ్యవసాయ ఎరువుల తయారీ విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.చిరంజీవి, జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ మేనేజర్ తాతారావు, ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ సోమిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.