ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యాలయంలో బాలిక ప్రసవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 01, 2024, 07:19 PM

చదువుకుంటున్న బాలిక గర్భం దాల్చి పాఠశాలలోనే ప్రసవించిన ఘటన కొత్తపట్నం మండ లం పాదర్తి కేజీబీవీ పాఠశాలలో బుధవారం జ రిగింది. ఈ వ్యవహారంపై అధికారులు సీరియస్‌గా స్పందించారు. వెంటనే బాలికను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కస్తూర్బాగాంధీ బా లికల విద్యాలయంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న 16ఏళ్ల బాలిక క్యాంపస్‌లో ని బాత్‌రూమ్‌లోనే ప్రసవించింది. ఆ తర్వాత దాదాపు రెండు మూడు గంటలపాటు అందులోనే ఉండిపోయింది. దీంతో ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు బాత్‌రూమ్‌లోకి తొంగిచూడటంతో ప్రసవించిన విషయం బయటకు తెలిసింది. బాలికను బయటకు రప్పించి విచారించారు. చీమకుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక జూన్‌ 19వతేదీన పాదర్తి వద్ద ఉన్న కేజీబీవీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం లో చేరింది. చేరిన తర్వాత వారంరోజుల పాటు హోమ్‌సిక్‌ పేరుతో ఇంటికి పోయి తిరిగి పాఠ శాలకు వచ్చింది. రోజూ తరగతులకు హాజరవు తూనే ఉంది. బుధవారం ఉదయం 11గంటల సమయంలో బాత్‌రూమ్‌లోకి పోయి ప్రసవిం చిందని కళాశాల ప్రిన్సిపాల్‌, ఇతర ఉపాధ్యా యులు చెబుతున్నారు. స్థానిక మహిళా పోలీ సు ద్వారా విషయం తెలుసుకున్న కొత్తపట్నం ఎస్‌ఐ సాంబశివరావు కేజీబీవీకి వెళ్లి విచారణ జరిపారు. కొత్తపట్నం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ వైష్టవి పాఠశాలకు వెళ్లి బాలికకు ఆరో గ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధి కారి సుభద్ర, రిమ్స్‌ వైద్యశాల సిబ్బంది అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. కాగా బా లిక తొమ్మిది నెలల గర్భవతిగా కళాశాలలోనే రెండు నెలల పాటు చదువు కొనసాగిస్తుండగా ఆ విషయాన్ని పాఠశాల ిసిబ్బంది ఎందుకు గు ర్తించలేకపోయారు అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రసవానికి ముందు పడే వేదన అంతా ఇంతా కాదు. ఆ సమయంలో కూడా బాలిక నొప్పులు పడుతున్న విషయం కూడా తమకు తెలియద ని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు. బాలిక బాత్‌రూమ్‌కు పోయి గంటల తరబడి రాకపో యేసరికి వెళ్లిచూడగా అసలు విషయం తెలిసిం దని కళాశాల ప్రిన్సిపాల్‌ అంటున్నారు. అప్పటి వరకు తమకు ఆ బాలిక గర్భవతి అని తెలియ దని అంటున్నారు. కాగా బాలికకు జన్మించిన శి శువు మృతి చెందింది. బాధితురాలిని వైద్యం కో సం రిమ్స్‌కు తరలించిన అధికారులు పూర్తి వివ రాలు తెలుసుకుంటున్నారు. కాగా బాలిక చీమ కుర్తి మండలానికి చెందిన కారణంగా చీ మకు ర్తి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com