డెంగ్యూ వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసు కోవాలని ప్రిన్సిపాల్ జె.వెంకటలక్ష్మి కోరారు. పలాస స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు డెంగ్యూ, మలేరియా జ్వరా లపై తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫిలిప్పీన్స్ దేశంలో హౌస్ సర్జన్‌గా శిక్షణ పొం దుతున్న జూనియర్ వైద్యుడు పి.శివమ్ మదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీడీ మధు, వైస్‌ప్రిన్సిపాల్ గణపతి, అధ్యాపకులు పాల్గొన్నారు.