ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగల చిరకాల పోరాటానికి ఫలితం దక్కిందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ఎప్పుడూ సానుకూలంగానే వ్యవహరించారన్నారు. సామాజిక న్యాయం పాటించే పేటెంట్ హక్కు టీడీపీదేనని మరోసారి స్పష్టమైందని ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి కుల రాజకీయం చేసిన వ్యక్తి జగన్ అని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. మాదిగలను కేవలం తన ఓటు బ్యాంకుగానే జగన్ చూశారు తప్ప ఏనాడూ వర్గీకరణపై మాట్లాడలేదని పేర్కొన్నారు. వర్గీకరణ కోసం దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్న మాదిగలకు సుప్రీం తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. దళితులంతా ఐక్యతతో ముందుకు సాగాలని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. మాదిగలకు రాజ్యాంగ ఫలాలు అందాలన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. ఇవాళ న్యాయం గెలిచిందని తెలిపారు. మా ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచిందని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు.