టీడీపీ అధినేత ముఖ్యమంత్రి రాజకీయం అందరికీ తెలిసిందే. ఆయన సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న నాయకుడు. ఆ విధంగా ఆయన అనుభవంతో పడిపోయారు. ఇక ఆయన నాలుగవ సారి ఏపీకి సీఎం అయ్యారు. ఇదిలా ఉంటే సీఎం అయిన దగ్గర నుంచి చంద్రబాబు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు.ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చామని అయితే ఆర్ధిక పరిస్థితి తలచుకుంటే భయం వేస్తోంది అని చంద్రబాబు చెప్పారు.తాజాగా శ్రీశైలం పర్యటనలో బాబు ఏపీ ఖజానా ఖాళీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కూటమిని ఆదరించి అంతా ఓట్లేశారు కానీ ఖజానాలో చిల్లి గవ్వ లేదంటూ బాబు చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు తావిస్తున్నాయి.ఆయన పదే పదే ఈ రకంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మీద జనంలోకి వచ్చినపుడు కానీ మీడియా ముందు కానీ ప్రభుత్వ పార్టీ సమావేశాలలో కానీ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఒక రకంగా మైండ్ గేమ్ అని అంటున్నారు.