విశాఖపట్నం జిల్లాలో మొత్తం 1,63,210 మందికిగాను 1,58,686 మందికి (97.23 శాతం) గురువారం ఎన్టీఆర్ సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. అత్యధికంగా పెందుర్తి మండలంలో 4,222కి 4,230 మందికి (97.82 శాతం), అతి తక్కువగా భీమునిపట్నం మండలంలో 6,161కి 5,940 మందికి (96.41 శాతం) పింఛన్లు అందజేశారు. ఉదయం ఆరు గంటలకు అప్పుఘర్, జోడుగుళ్లపాలెం ప్రాంతంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, మహారాణిపేట ప్రాంతంలోని రంగిరాజు వీధిలో విశాఖ ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ పింఛన్లు పంపిణీలో పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీని డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారి శోభారాణి, జీవీఎంసీ యూసీడీ పీడీ ఫణిరామ్లు పర్యవేక్షించారు. మిగిలిన వారికి పింఛన్లు శుక్రవారం అందజేయాలని నిర్ణయించారు.