నెల్లిమర్ల మండలంలోని మొయిద విజయరాంపురం బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో ఖాళీ సీట్ల భర్తీకి విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు వసతిగృహ సంక్షేమ అధికారి, పతివాడ కన్నంనాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల నుంచి ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోనున్నట్టు ఆయన వివరించారు. ఖాళీల భర్తీకి సంబంధించి జిల్లా బీసీ సంక్షేమ అధికారి, జిల్లా సహాయ బీసీ సంక్షేమ అధికారి జారీచేసిన ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపడుతున్నట్టు కన్నంనాయుడు తెలిపారు.