ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీపీఎం నేతలని క్షమాపణ అడిగిన లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 02, 2024, 10:16 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన పట్ల మన్నించాల్సిందిగా ట్విట్టర్(X)లో మంత్రి నారా లోకేష్  సంచలన ట్వీట్ చేశారు. తమను మన్నించండి కామ్రేడ్ అంటూ లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్వీట్‌ను ఏపీ పోలీస్ 100కు మంత్రి నారా లోకేష్ ట్యాగ్ చేశారు. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు తమ కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. ‘‘గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నాను’’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com