నెల్లూరు టౌన్ ప్లానింగ్‌లో స్పెషల్ డ్రైవ్ నిత్యం కొనసాగుతుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అన్ని అనుమతులు ఉండి నిర్మాణానికి నోచుకోని పెండింగ్ పనులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రోజు 76 పెండింగ్ అనుమతుల్లో 50 క్లియర్ చేశామన్నారు. అన్ని అనుమతులు ఉండి జాప్యం చేస్తున్న పనులను సత్వరమే పరిష్కరిస్తున్నామని వివరించారు. రాష్ట్ర స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు. ఎల్లుండి విశాఖపట్నలో టౌన్ ప్లానింగ్‌పై స్పెషల్ డ్రైవ్ ఉంటుందని చెప్పారు. గురువారం నాడు మంత్రి నారాయణ నెల్లూరులో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. టౌన్ ప్లానింగ్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరిస్తున్నామని చెప్పారు. 2014 లో దేశంలో మొదటి సారి టీడీపీ ప్రభుత్వం ఆన్‌లైన్ వ్యవస్థ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. టౌన్ ప్లానింగ్‌లో శాఖ జాప్యం ఉంది.. ఇక అటువంటి పరిస్థితి ఉండదని చెప్పారు.