గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టయ్యారంటూ వచ్చిన వార్తలపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. వంశీని అరెస్ట్ చేయలేదని, అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్‌ను అరెస్ట్ చేశామని వివరించారు. యూసఫ్ పఠాన్ ఉన్న కారులోనే వంశీ ఉన్నట్లు ప్రచారం జరిగిందని, ఆయన ఇంకా దొరకలేదని పోలీసులు అంటున్నారు. మరో అనుచరుడు రమేశ్‌ని నిన్న (గురువారం) రాత్రి అరెస్ట్ చేశామన్నారు. వంశీ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని, హైదరాబాద్, గన్నవరం సహా పలు ప్రాంతాల్లో వంశీ కోసం గాలిస్తున్నట్టు వివరించారు.