శ్రీశైలం జలాశయం 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో : 4,65,261 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 4,91,602 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం : 883.80 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం : 208.7210 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. శ్రీశైలం డ్యాం దిగువన వరదనీటలో వ్యక్తి గల్లంతు అయిన ఘటన కలకలం రేపుతోంది. శ్రీశైలం జలాశయం లింగలగట్టు పెద్ద బ్రిడ్జ్ కింద స్నానానికి దిగి వరద నీటిలో అందరూ చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయి వ్యక్తి గల్లంతు అయ్యాడు. అతను నల్లగొండ జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన చొప్పరి యాదయ్య (50)గా గుర్తించారు. శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనార్థం స్నేహితులతో కలిసి యాదయ్య వచ్చాడు. యాదయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.