శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తూనే ఉంది. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో : 4,54,710 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 5,16,501 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం : 883.800 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం : 204.7888 టీఎంసీలుగా ఉంది. కుడి ,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.