గుంతకల్లు పట్టణంలోని ప్రశాంత నగర్లో నీలావతి అనే మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని దండుగులు లాక్కొన్ని పరారయ్యారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రిటైర్డ్ ఏఎ్‌సఐ త్యాగరాజు సతీమణి నీలావతి శుక్రవారం ఉదయం ఇంటి ముందర కసువు ఊడ్చి చెత్తను సమీపంలోని డస్ట్బినలో వేసేందుకు వెళ్తోంది. ఆ సమయంలో ఇద్దరు గుర్తుతెలియని దుండుగులు బైక్‌లో వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కొన్ని వెళ్లారు. ఆమె గట్టిగా అరిచేలోపు వారు పరారయ్యారు. బాధితురాలు వనటౌన పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేసింది. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.