ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జలజీవన్‌ ద్వారా నీటి సమస్యని తీర్చాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 03, 2024, 03:14 PM

వైపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాలల్లో శాశ్వతంగా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని వై.పాలెం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అధికారులకు సూచించారు. శుక్రవారం మార్కాపురంలోని తన కార్యాల యంలో పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, వెలుగు, విద్య, ఉపాధిహామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గం లోని ఐదు మండలాల్లో జలజీవన్‌ ద్వారా చేసిన పనులను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. నియోజవర్గం లోని తాగునీటి పథకాల ద్వారా ప్రజల దాహార్తిని తీర్చేలా నీరివ్వాలన్నారు. ఉపాధి హామీ పథకంలో లోటుపాట్లు లేకుండా రైతులకు మొక్కలపెంపకం సక్రమంగా అమలు చేయాలన్నారు. ఉపాధి నిధుల ద్వారా గ్రామాల్లోని లింకురోడ్లకు మరమ్మతులు చేయించు కోవాలన్నారు. వెలుగు ద్వారా మహిళలకు రుణాలు ఇచ్చి వారు అభివృద్ధి చెందేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మర్ధన్‌అలీ, వెలుగు ఏసీ లక్ష్మారెడ్డి, డ్వామా ఏపీడీ నిర్మలాదేవి, పీఆర్‌ డీఈ మద్దుల సుబ్బారెడ్డి, ఐదు శాఖల అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com