కందుకూరు పట్టణంలో 1. 26 కోట్ల పనులకు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు శనివారం శంకుస్థాపన చేశారు. క్లబ్ నుంచి ఆదిఆంధ్ర కాలనీ వరకు 16. 65 లక్షలతో తారురోడ్డు నిర్మాణం, మధ్యలో వాగుపై 1. 1 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన ప్రారంభించారు. ఈ రోడ్డు అధ్వానంగా మారడంతో, ఈ ప్రాంత ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎన్నికలకు ముందు స్వయంగా చూశానని అందుకే మొదటి ప్రాధాన్యతగా ఈ రోడ్డు పనులు చేపట్టడం జరిగిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa