భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును విశాఖ జీవీఎంసీ స్థాయీ సంఘం చైర్మన్లుగా పోటీ చేస్తున్న పి. వి. నరసింహం, బొమ్మిడి రమణ, బల్ల శ్రీను, గొలగాని వీరారావు, విల్లూరి భాస్కరరావు, నొల్లి నూకరత్నం సోమవారం ఎంవీపీలోని ఆయన నివాసంలో కలిశారు. అత్యధిక మెజారిటీతో పది చైర్మన్ పదవులను దక్కించుకోవాలని గంటా అన్నారు. విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని అభ్యర్థులతో చర్చించారు.