కుప్పం మున్సిపాలిటీ పరిదిలోని కమతమూరు సచివాలయంలో సోమవారం కమిషనర్ శ్రీనివాసరావు మహిళా సమాఖ్య సభ్యులతో సమావేశంలో పాల్గొన్నారు. కనకదుర్గా గ్రూపు సభ్యులు రాజధాని అమరావతి నిర్మాణానికి 49 వేల రూపాయలను కమిషరుకు అందజేశారు. సమావేశంలో కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ. ఇండ్ల వద్ద శుభ్రత మరియు మహిళల ఆర్థిక అభివృద్ధికి సంభందించిన అంశాలను చర్చించారు. ప్రతాప్, జగదీష్, శోభ తదితరులు పాల్గొన్నారు.