ఓ స్నేహితుని అనురాగాన్ని తండ్రి అపార్థం చేసుకోవడంతో కుమార్తె బలవన్మరణం పొందింది. నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన జక్కి రేణుక యల్లమ్మ(22) బీటెక్ చదువుతోంది. ఆమెను చెల్లెలుగా చూసుకునే ఓ సీనియర్ ఫోన్ చేయగా ఆమె పనిలో ఉండి స్పందించలేదు. దీంతో ఆమె తండ్రి గౌరప్పకి ఫోన్ చేసి ఆరా తీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి కూతురిని మందలించాడు. ’నేను తప్పు చేయలేదు నాన్నా‘.. అని సూసైడ్ నోట్ రాసి వసతి గృహంలో ఆత్మహత్య చేసుకుంది.