రిమ్స్ సెక్యూర్టీ గార్డ్స్ 3 నెలల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని రిమ్స్ కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో కార్మికులు నిరసన తెలిపారు. వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూర్టీ గార్డ్స్ కి రిమ్స్ అధికారులు, మెటా ఫోర్స్ యాజమాన్యం రక్షణ కల్పించాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలన్నారు.