సీజనల్ వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాజాం మున్సిపల్ కమిషనర్ అన్నారు. మంగళవారం కాలువలు క్లీనింగ్, పారిశుద్ధ్య సేవలు, వ్యాధులు ప్రబలకుండా ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వివరించారు. బాధ్యతగా పనిచేయాలన్నారు. విద్యుత్ లైటింగ్ సిబ్బంది చక్కగా పని చేయాలన్నారు. వార్డుల్లో నివసిస్తున్న ప్రజలు కాలువలలో చెత్త చెదరాన్ని మరియు కొబ్బరి బొండాలు వంటి వ్యర్థ పదార్థాలను వేయవద్దని తెలిపారు.