శ్రీసత్యసాయిజిల్లా మడకశిర పట్టణం వడ్రపాలెం ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మంగళవారం పరిశీలించారు. పాఠశాలకు నిధులు సరిపోకపోవడంతో పాఠశాలలోని పనులు నిలిచిపోయాయి. పిల్లల భవిష్యత్తు ధ్యేయంగా పనిచేస్తున్న టీచర్ సుజాత తమ సొంత నిధులతో మిగిలిపోయిన పనులను చేపిస్తున్నారు. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఉపాధ్యాయురాలు సుజాతను అభినందించారు. స్కూలుకు కావాల్సిన సదుపాయాల అన్ని కల్పిస్తామని తెలిపారు.