ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, ఏలూరు జిల్లాలోని నూజివీడులో గతంలో మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయాల్లో ఈ విద్యాసంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని పార్లమెంట్ లోని ఆయన ఛాంబర్ లో కలిసి వినతి పత్రం అందించటం జరిగింది. 2023 సెప్టెంబర్ 22న జరిగిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ సమావేశంలో నందిగామ, నూజివీడ్ లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు అనుమతి మంజూరైనట్లు తెలియజేశాను. నందిగామ, నూజివీడ్‌లో తాత్కాలిక భవనాల సిద్ధతపై కేంద్ర విద్యాలయ సంఘటన్ నివేదిక పంపమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్‌ను కోరిన విషయం, వారు ఆ నివేదిక తయారు చేసి డిప్యూటీ రీజినల్ కమిషనర్ పికెట్ గారికి, సికింద్రాబాద్ పంపించిన విషయం ,ఇప్పుడు ఆ నివేదిక న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కి చేరినట్లు వివరించటం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ విషయం పై సానుకూలంగా స్పందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.