ప్రతిరోజూ ఉదయం పాఠశాలకు రాగానే బాత్‌రూమ్‌ల పరిశుభ్రతను తెలిపేలా వాటి ఫొటోలను తీసి అప్‍లోడ్ చేసేపని ఇక ఉపాధ్యాయులకు లేదని, ఈ విధానాన్ని ఆపేశామని.. ఈ ఆప్షన్‍ను యాప్ నుంచి కూడా తొలగించామని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను పిల్లలకు టీచర్లు అందించాలని, క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార బాధ్యతను తాము తీసుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.