సీపీఐ, రైతు సంఘం ఉమ్మడి అనంతపురం జిల్లా కమిటీ ఆదేశాల మేరకు రైతు సమస్యలపై ముదిగుబ్బ సీపీఐ నాయకులు, రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సీఎస్‌డీటీ మునిస్వామికి వినతి పత్రం అందించారు. సీపీఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఈ ఏడాది మండలంలో 20 శాతం కూడా వేరుశనగ పంట సాగు చేయలేదన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యా మ్నాయ పంటల సాగులో భాగంగా రైతులకు 100 శాతం సబ్సిడీతో విత్తనాలను పంపిణీ చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద 20 వేల రూపాయలను తక్షణమే మంజూరు చేయాలన్నారు.